వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటంలో ఉత్తమ సేవలు అందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేర్లతో ప్రభుత్వం పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కదిరిలో నిర్వహించిన వాలంటీర్ల వందనం కార్యక్రమ వేదికపై ప్రజాప్రతినిధులు, అధికారుల కంటే వైకాపా నాయకులే ఎక్కువ కనిపించారు. ఛైర్ పర్సన్ నజిమున్నిసా, వైస్ ఛైర్‌పర్సన్ గంగాదేవిలతో పాటు వైకాపా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్‌అహ్మద్, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త శాంతమ్మ, నాయకులు శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు వేదికపై ఆశీనులయ్యారు. వాలంటీర్లను సన్మానించి, పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వాలంటీర్ల సేవలను కొనియాడారు.
source : eenadu.net
Discussion about this post