అన్నీ తల కిందులవుతున్నాయి. బీజేపీతో పొత్తు అంటూనే నిర్ణయం పెండింగ్‌లో పెట్టారు. అటు సీఎం జగన్ ఎలక్షన్ డ్రైవ్ స్పీడ్ పెంచారు. YSRCP అభ్యర్దుల పైనా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఇన్‌ఛార్జ్‌ల లిస్టు ప్రకటిస్తున్నారు. ఇటు బాబు కూటమిలో మాత్రం సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. జనసేన, బీజేపీతో పొత్తుతో సీన్ మార్చాలనే చంద్రబాబు వ్యూహాలు తిరగబడుతున్నాయి. సీట్లు, సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే కూటమి ఓట్లలో స్పష్టంగా చీలికలు కనిపిస్తున్నాయి.
ఒక్క పొత్తు కోసం చంద్రబాబు అడుగు ముందుకు వేస్తే అనేక నష్టాలు వెంటాడుతున్నాయన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్లలో మొదలయ్యాయి. అసలు YSRCP వ్యతిరేక ఓటు చీలకూడదన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మూల సిద్దాంతానికే బీటలు వారుతున్నాయి.
source : sakshi.com
Discussion about this post