తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మంగళవారం ప్రచారం చేస్తూ ఆయన మాట్లాడారు. లేపాక్షిని యునెస్కో జాబితాలో చేర్చడానికి అవసరమైన డోసియర్‌ను కేంద్రానికి పంపడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలంలో రెండోరోజైన మంగళవారం ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరితో చేతులు కలుపుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొండూరులో డప్పు కొట్టి కూటమి నాయకుల్లో ఉత్సాహం నింపారు.
source : eenadu.net
Discussion about this post