రైతులంతా సీఎం జగన్‌ను పూజించాలి.. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిన సీఎంకు రుణపడి ఉండాలని పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో కలిసి కాకినాడలో శనివారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. వాటికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. అనంతపురంలో ఆదివారం జరిగే సభలో రైతు రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన చేయవచ్చని వెల్లడించారు.
source : eenadu.net










Discussion about this post