పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన 1,02,058 మంది విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 3473 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తిచేసింది. 682 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను, 156 మంది ఫ్లయింగ్ స్వ్కాడ్స్‌ను నియమించింది. పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మిగిలిన 6 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ స్కూల్ విద్యార్ధులకు మార్చి 18 నుంచి 26 వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. 34,635 మంది పదో తరగతి విద్యార్ధులు 176 కేంద్రాల్లో, 76,572 మంది విద్యార్ధులు 327 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.
Discussion about this post