ఉరవకొండలో ఈనెల 27న జరుగనున్న రా కదలిరా బహిరంగ సభకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధమయ్యారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్ శ్రీధరమూర్తితో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. తెదేపా అధినేత చంద్రబాబు హాజరువుతున్న ఈ సభకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి లక్ష మంది జనం తరలిరావడానికి అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల నుంచి వచ్చే తెదేపా శ్రేణుల సౌకర్యార్ధం ఇతర సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప పరిశీలించారు. తెదేపా నాయకులు నెట్టెం రాంబాబు, బోస్ యర్రగుంట్ల వెంకటేశ్ ప్యారం భరత్ సుంకురత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post