ఈ నెల ఆరో తేది చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరులో నిర్వహించనున్న రా.. కదలిరా.. బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆయన నాయకులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొనే ఈ సభకు రెండు లక్షల మంది వస్తారన్నారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి పోయారని చెప్పారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, నియోజకవర్గ బాధ్యుడు థామస్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబునాయుడు, పార్లమెంటు నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు నాగేశ్వరరాజు, మాజీ ఎంపీపీ హరిబాబు, వైవీరాజేశ్వరి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, రుద్రయ్య, చెంగల్రాయ యాదవ్, లోకనాథరెడ్డి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post