టీడీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆదివారం పరిగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. పరిగి మండ లంలోని గొల్లపల్లి, బీచిగానపల్లి, వంగలపల్లి, శీగుపల్లి, గణపతిపల్లి, పైడేటిలలో ఆమె ప్రచారం సాగించారు. ప్రతి గ్రామంలోను ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. మోద గ్రామం నుంచి దివ్యాంగుడు మూడు చక్రాల వాహనంలో తరలి వచ్చి సవిత ర్యాలీలో పాల్గొన్నాడు. అతడిని ఆమె ఆప్యాయంగా పలకరించారు. క్రిస్టియన సభ్యులు సవితను సన్మానించి, ఆమె విజయం కోసం ప్రత్యేక ప్రార్థన లు చేశారు. ఈ సందర్బంగా సవిత మాట్లాడుతూ… యువతకు జాబు రావాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా టీడీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పది కుటంభాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరగా, సవిత కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీచిగానపల్లి సర్పంచ బాలాజీ, మాజీ జడ్పీటీసీలు ధనాపురం సూరి, నంజుండప్ప, మాజీ ఎంపీపీ కాలవపల్లి సత్య నారాయణ, మాజీ ఎంపీపీ క్రిష్ణమూర్తి, వడ్డె సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ హనుమయ్య, పెద్దరెడ్డిపల్లి సోమప్ప, మాజీ సర్పంచ నాగప్ప, తిప్పారెడ్డి, నారాయణరెడ్డి వేలాది మంది ప్రజలు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
పెనుకొండ టౌన : ఒక్క చాన్సతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డి అరాచకాలు, అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్ర బా బు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆమె ఆదివారం పెనుకొండ పట్టణంలోని బోయగేరిలో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. భర్త వెంకటేశ్వరరావు, టీడీపీ శ్రేణులతో కలిసి ప్రచారం సాగించారు. వాల్మీకి విగ్రహానికి పూలమాలలువేసి ప్రచారం ప్రారంభించారు. సూపర్‌సిక్స్, మినీ మేనిఫెస్టో పథకాలను వివరించారు.
source : andhrajyothi.com
Discussion about this post