రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల నుంచి తెదేపాదే భవిష్యత్తు అని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని కులుమాలలో బీసీ, ఎస్సీ కాలనీల్లో బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలంతా ఏకమై వైకాపాకు చరమగీతం పాడాలన్నారు. మన భవిష్యత్తు బాగుండాలంటే తెదేపాను గెలిపించాలని కోరారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో జల్‌జీవన్ మిషన్ పనుల కోసం కాలనీల్లో తవ్వకాలు చేపట్టి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నజీర్‌సాహెబ్, రాముడు, తిరుపతయ్య, బడేసా, సర్పంచి బుడ్డన్న, చాంద్‌బాషా, రామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కాశింవలి, మోహన్‌రెడ్డి, తిప్పన్న, కృపానందం పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post