రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న నవరత్నాల సేవల విశిష్టతను, అవసరాన్ని తెలియజేస్తూ పద్య నాటిక రూపంలో అనంత కళాకారులు అద్బుతంగా ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం రాప్తాడు జరిగే ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో నాటికను ప్రదర్శించేందుకు కళాకారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు దక్షిణ భారతదేశ సాంస్కృతిక మండలి సభ్యుడు మైఖేల్‌బాబు శుక్రవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభ ప్రారంభమయ్యే వరూ జగనన్న జయకేతనం పేరుతో నాటిక ప్రదర్శన ఉంటుఏందన్నారు.
అలరించిన నాటకం
రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆలమూరు గ్రామంలో శుక్రవారం అనంత రంగస్థల కళాకారులు ప్రదర్శించిన ‘జగనన్న జయకేతనం’ నాటిక ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా రాజారెడ్డి, తిమ్మరసుగా వెంకటేష్, రాయల ప్రతినిధులుగా నరసింహులు, రమణ, రైతుగా దేవరపల్లి వెంకటేశ్, రైతు భార్యగా సరోజమ్మ, పాలేరుగా భీమలింగ, డప్పు అంజి తదితరులు పాత్రోచితంగా నటించి మెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలను చైతన్య పరిచేలా అద్భుత అభినయంతో నటీనటులు ఆకట్టుకున్నారు.
source : sakshi.com
Discussion about this post