యర్రగుంట గ్రామ పరిధి 121 సర్వే నెంబరులో 47 ఎకరాల్లో చెరువు ఉంది. దీనికి ఆనుకుని వైకాపా నాయకుడు లక్ష్మీనరసింహరెడ్డికి కొంత పొలం ఉంది. ఈయన గ్రామంలో రేషన్ డీలర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల చెరువు స్థలం రెండు ఎకరాలు ఆక్రమించి పొలంలో కలిపేసుకున్నారు. చుట్టూ కంచె వేసి కొబ్బరితోట పెట్టారు. గతంలో చెరువు స్థలంలో నిర్మించిన చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాన్ని తన పొలంలో కలిపేసుకుని కంచె వేసుకున్నారు. ఆక్రమణల తీరుపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.
source : eenadu.net
Discussion about this post