వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 11వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది.
ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం జగన్ బయలుదేరుతారు.
ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు.
source : sakshi.com
Discussion about this post