మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
source : sakshi.com










Discussion about this post