నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర
ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు
సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది
అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు
అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు
సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగుతుంది
అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్ రాత్రి బస చేస్తారు
Discussion about this post