ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్‌సీపీ ముమ్మర కసరత్తు
27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు.. తుది దశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను నెరవేర్చి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం
58 నెలల్లో 99 శాతం హామీలు అమలు
చెప్పిన వాటితోపాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్
నవరత్నాలతో డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ.. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం
డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి
వాటి ద్వారా 87 శాతం కుటుంబాలకు ప్రయోజనం
సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత.. నాలుగు సిద్ధం సభల్లోనూ ఇది ప్రస్ఫుటితమైందంటున్న రాజకీయ పరిశీలకులు
చెప్పాడంటే చేస్తాడంతే అంటూ సీఎం జగన్ మేనిఫెస్టోపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రజలు
2014 ఎన్నికల్లో ఏకంగా 650 హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
అందులో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించిన వైనం
చంద్రబాబు చెప్పిందేదీ చేయడనే భావన ప్రజల్లో బలీయంగా నాటుకు పోయిందంటున్న పరిశీలకులు
అందువల్లే గతేడాది మే 28 నుంచి సూపర్ సిక్స్ అంటూ బాబు ఊదరగొడుతున్నా పట్టించుకోని ప్రజానీకం
source : sakshi.com
Discussion about this post