చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్‌సీపీ బ్యాన్‌చేసి ప్రెస్‌మీట్‌లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు.
source : sakshi.com
	    	
                                









                                    
Discussion about this post