ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలు ఉంటుంది. అలాంటి మీ ఓటు ఉన్నదో, లేదో ఎప్పడికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వయోజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ భవిష్యత్‌ను మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు. పాలకులను ప్రశ్నించే అధికారం ఓటు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించేది ఓటు. మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు. లేదంటే మార్చేస్తారు. కావాలంటే నకిలీ ఓట్లు చేర్చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు’ అని చంద్రబాబు నాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి తుది ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడాదిలో 30 లక్షల దొంగ ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఆ ఓట్లపై ప్రతిపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు మీ ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించారు.
source : https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/people-are-to-alert-on-their-vote-chandrababu-sdr-1201074.html
Discussion about this post