బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా…! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ గోవిందా…! ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా.. గోవిందా! తిరుమల వెంకన్న స్వామిని తలచుకుని చెప్పే గోవిందా గోవిందాలు కావు ఇవి. బాబును నమ్మితే అన్నీ గోవిందా..!
జగన్‌ను ఎందుకు ఓడించాలని అడగండి. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా? ఇంటింటికీ సంక్షేమాన్ని అందిస్తూ మంచి చేస్తున్నందుకా? చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు,జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం కోసం జగన్‌ను ఓడించాలా? వీరంతా కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా..? దోచుకున్నది పంచుకోవడం కోసమా? మరి జగన్‌ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబూ?
మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను ‘‘బచ్చా..’’ అని అంటూనే భయపడుతున్నారు. చంద్రబాబూ నువ్వు నిజంగా అంత పుడింగే అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా? 14 ఏళ్లలో ఏ ఒక్క మంచీ చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ఐదేళ్లలో చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరు బచ్చా? ఎవరు లీడర్? చెప్పు చంద్రబాబూ..!
source : sakshi.com
Discussion about this post