ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజా జాబితాలో 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. తాజా జాబితాతో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 142కి చేరుకుంది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్ సభతో పాటు 8 అసెంబ్లీ సీట్లను సీపీఎంకి కేటాయించారు.
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులు వీరే..
.బొబ్బిలి – మరిపి విద్యాసాగర్
.శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు
.నెల్లిమర్ల – ఎస్ రమేశ్ కుమార్
.గజపతినగరం – దోలా శ్రీనివాస్
.విశాఖ ఉత్తరం – లక్కరాజు రామారావు
.చోడవరం – జగత్ శ్రీనివాస్
.ఆచంట – నెక్కంటి వెంకట సత్యనారాయణ
.యలమంచిలి – టి నర్సింగ్ రావు
.పి. గన్నవరం – కె చిట్టిబాబు
.జగ్గయ్యపేట – కర్నాటి అప్పారవు
.విజయవాడ ఈస్ట్ – సుంకర పద్మశ్రీ
.రేపల్లె – మోపిదేవి శ్రీనివాసరావు
.తాడికొండ – మణిచల సుశీల్ రాజా
.తెనాలి – ఎస్కే బషీద్
.చీరాల – ఆమంచి కృష్ణమోహన్
.గుంటూరు వెస్ట్ – రాచకొండ జాన్ బాబు
.ఒంగోలు – తుర్లపాక నాగలక్ష్మీ
.కనిగిరి – దేవరపల్లి సుబ్బారెడ్డి
.కావలి – పొదలకూరి కల్యాణ్
.కోవూరు – నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
.సర్వేపల్లి – పీవీ శ్రీకాంత్ రెడ్డి
.గూడురు – రామకృష్ణరావు
.సూళ్లూరుపేట – చందనమూడి శివ
.వెంకటగిరి – పి శ్రీనివాసులు
.కడప – అస్జల్ అలీఖాన్
.జమ్మలమడుగు – పాముల బ్రహ్మానందరెడ్డి
.పులివెందుల – మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
.ప్రొద్దూటూరు – షేక్ మహ్మద్ నజీర్
.మైదుకూరు – గుండ్లకుంట శ్రీరాములు
.ఆళ్లగడ్డ – బారగొడ్ల హుస్సేన్
.బనగానపల్లె – గూటం పుల్లయ్య
.శ్రీశైలం – సయ్యద్ ఇస్మాయిల్
.డోన్ – గారపాటి మధులెట్టిస్వామి
.ఆదోని – గొల్ల రమేశ్
.ఆలూరు – నవీన్ కిశోర్
.కళ్యాణదుర్గం – రాంభూపాల్ రెడ్డి
.హిందూపురం – మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా
.ధర్మవరం – రంగాన అశ్వర్థ నారాయణ
Discussion about this post