గోరంట్ల (అనంతన్యూస్ బ్యూరో ) శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం మారాల పంచాయతీలో మాజీ ఎంపీటీసీ ఆకులేటి నాగమణప్ప అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించి, అనంతరం ఇదే పంచాయతీలో టీడీపీ కార్యకర్త సి. నరసింహులు కూడా అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సాయం అందించి అనంతరం మారాల గ్రామంలో ని టీడీపీ అభిమాని ఆయిన భాష పాము కాటుకి గురి కావడం తో అతనిని పలకరించి, ఆరోగ్యం గురించి చర్చించి అతనికి 2000 ఆర్థిక సాయం అందించిన మనసున్న మారాజు నిమ్మల కిష్టప్ప అనీ మరోసారి నిరూపించుకున్నారు. కార్యకర్తలే టీడీపీ కి ప్రత్యేక్ష దేవుళ్ళు గా భావించారు. ఎ సందర్భం లో అయినా కార్యకర్తలకు అండగా ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల క్రిష్టప్ప తెలిపారు. ఈ వీరి వెంట వంశి, అంజి రెడ్డి కే చంద్ర, ఎం నాగరాజు, మరియు బుక్కపట్నం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు…
Discussion about this post