‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’.. అంటూ గత ఎన్నికల సమయంలో ఊరూరా పాదయాత్రగా తిరిగిన జగన్ మోహన్‌రెడ్డి.. తానొక ఆపద్బాంధవుడినంటూ ప్రగల్భాలు పలికారు. పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాటిలో ఒక్కటీ పూర్తి చేయలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో పక్కనపెట్టగా- తాను చేస్తానన్న వాటినీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన ఆయన.. ఆయా ప్రాంతాలపై వరాల జల్లు కురిపించారు. నిధుల వరద పారిస్తామని హామీ గుప్పించారు. ఇవన్నా కొలిక్కి వచ్చాయా అంటే.. ఒక్కటంటే ఒక్కటీ పూర్తికాని పరిస్థితి నెలకొంది. మళ్లీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు.. అవి నెరవేరని వైనంపై కథనం.
source : eenadu.net










Discussion about this post