ఏపీలో వైకాపా బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని పర్వతదేవరపల్లి, మామిళ్లపల్లిలో తెదేపా ప్రవేశపెట్టిన పథకాలపై గురువారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ముక్తాపురంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఆమె మాట్లాడుతూ… బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా మాత్రమేనని స్పష్టం చేశారు. వైకాపా కార్పొరేషన్లును ఏర్పాటు చేసి ఛైర్మన్, డైరెక్టర్లను నియమించారు కానీ…వారికి ఒక్క రుణం ఇప్పించే అధికారం ఇవ్వలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రూ.4 వేల పింఛన్‌ను అందిస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post