ఎన్నికలకు ముందు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ వారికి తీరని ద్రోహం చేశారని తెదేపా శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు. గురువారం పరిగిలో స్థానిక బీరలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో బీసీ సెల్
జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమంపై బహిరంగ సభను నిర్వహించారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో అధికార పార్టీకి చెందిన నాయకులు బీసీలను హత్యలు చేస్తూ దాడులకు తెగబడ్డారన్నారు. బీసీల ద్రోహి జగన్ ను రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, కుమ్మర, వక్కలిగ కన్వీనర్లు పోతులయ్య, పాండురంగప్ప, జనసేన పార్టీ నాయకులు సురేష్ తెదేపా జిల్లా లీగల్ సెల్ అధికార ప్రతినిధి శివశంకర్ పెనుకొండ నియోజకవర్గం తెదేపా కమిటీ అధ్యక్షుడు చిన్నప్పయ్య, తెదేపా పరిగి మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, శేఖర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post