నీటి ట్యాంకర్ల బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం వైకాపా సర్పంచులు, నాయకులు ధర్నా చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్రామాలకు నాలుగేళ్లుగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని, బిల్లులు సుమారు రూ.33 కోట్లు రావాల్సి ఉన్నాయని తెలిపారు. అధికార పార్టీలో ఉండీ బిల్లులను సాధించలేకపోతున్నామని వాపోయారు. మంత్రి సురేష్ పక్క నియోజకవర్గానికి వెళ్లిపోయి తమ బాధలు పట్టించుకోవడం లేదని వాపోయారు. పోలీసులు కూడలి వద్దకు వచ్చి ఆందోళనకు అనుమతి లేదంటూ హెచ్చరించారు. అప్పుడే ఆ దారిన వెళుతున్న వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ వాహనాలను సర్పంచులు, నాయకులు అడ్డుకున్నారు. సమస్యను జిల్లా కలెక్టర్‌తోపాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చి వారిని శాంతింపజేశారు.
source : eenadu.net
Discussion about this post