శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బికె. పార్థసారథి మీడియా సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు…
కామెంట్స్:
2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు నెరవేర్చలేదు..నాసిరకం మద్యంతో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు..మద్యపాన నిషేధం తుంగలో తొక్కాడు..నాసిరిక మద్యపానం వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..విద్యుత్ చార్జీలు 9సార్లు పెంచి 64 వేల కోట్లు భారం మోపాడు..వ్యవసాయ మీటర్ల పేరుతో 15 వేల కోట్లు దోపిడీ…2,30,000 మెగా డీఎస్సీ అన్నాడు మాట తప్పడుకేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు.. నేటికీ ఆచరణలోకి తీసుకురాలేదుఏపీలో అక్రమ ఇసుక రవాణా తో 50 వేల కోట్లు లూటీ చేశాడు..దేశంలో ఎక్కడలేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి..సిపిఎస్ రద్దు పై మాట తప్పడు, అన్న క్యాంటీన్ ఎత్తేశాడు, అమ్మ ఒడిలో అన్యాయం..అసైన్డ్ భూములను రక్షిస్తానని హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా 14 లక్షల ఎకరాలను కబ్జా చేశాడు…
Discussion about this post