ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాప్తాడు, బుక్కరాయసముద్రంలో నిర్వహించిన ‘షో’లు అట్టర్‌ఫ్లాఫ్ అయ్యాయి. జన సమీకరణకు రాప్తాడు, శింగనమల టీడీపీ అభ్యర్థులు పరిటాల సునీత, బండారు శ్రావణి పడరాని పాట్లు పడ్డారు. పక్క నియోజకవర్గాల నుంచి తరలించే ఏర్పాట్లు చేసినా సభలకు అంతంతమాత్రంగానే జనం వచ్చారు. వారు కూడా చంద్రబాబు రాకముందే వెనుదిరగడం గమనార్హం.
చంద్రబాబు ప్రసంగం కూడా ఆద్యంతం నిరుత్సాహంగా సాగింది. కార్యకర్తలను రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్లుగా ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆయన అనడం చూసి స్థానికులు నవ్వుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు పర్యటన చప్పగా సాగడంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
చంద్రబాబు పర్యటనలో పలువురు టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్లను మూసేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా దారి లేకుండా చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
source : sakshi.com
Discussion about this post