చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందని విమర్శించారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామని అన్నారు.
ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుందన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అంటేనే నిజం అని.. ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు. టీడీపీ పతనావస్థకు చేరిందని, ఇది ప్రారంభం మాత్రమేనని ;అన్నారు.
రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని. పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు .18న రాప్తాడులో వైఎస్సార్‌సీపీ ‘ సిద్ధం’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
source : sakshi.com
Discussion about this post