మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది.
తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు.
source : sakshi.com
Discussion about this post