రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడారు. బటన్ నొక్కుతున్నానని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారన్నారు. ‘‘బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?’’ అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు.
‘‘ఈ ఎన్నికల్లో రాష్ట్రం.. ప్రజలు గెలవాలి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదు. ఇలాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి. కరెంటు ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం మోపారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయింది. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదు? ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాలి. జగన్‌ది ఉత్తుత్తి బటన్ అని గమనించాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే’’ అని చెప్పారు.
source : eenadu.net










Discussion about this post