సీఎం జగన్ రెడ్డి బటన్ నొక్కడమేగాని, ఎన్నడూ డబ్బులు పడలేదని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. వెంకటాపురంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలోనే రైతుల పంటల బీమా బటనానికి వెళ్లారని, కానీ చాలా మందికి డబ్బులు పడలేదని అన్నారు. తాజాగా ఆయన ఉరవకొండకు వచ్చి ఆసరా పేరుతో మహిళలకు టోకరా వేసి వెళ్లారని. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ న్యాయం జరిగింది టీడీపీ హయాంలోనే అని అన్నారు. సీఎం ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఆయన వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. పోలవరం నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు వరకూ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శించారు.
source : andhrajyothi.com










Discussion about this post