సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనకు జనమంతా మద్దతుగా నిలుస్తున్నారని, ప్రజాభిమానంతో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ అన్నారు. సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ, మడకశిర అసెంబ్లీ అభ్యర్థి ఈరలక్కప్ప, పార్టీ ఎన్నికల పరిశీలకుడు ప్రసాద్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఫ్యాన్ ప్రభంజనం ముందు నిలువలేవన్నారు. తప్పకుండా జిల్లాలోని ఏడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. మోసానికి, వెన్నుపోటుకు నిదర్శనమైన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆపార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా కష్టమేనన్నారు. వైఎస్ జగన్ హమీలన్నీ నెరవేర్చారని, సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారన్నారు. అందువల్లే జనమంతా ఇప్పుడు వైఎస్సార్ సీపీ వెంట నడుస్తున్నారన్నారు.
source : sakshi.com










Discussion about this post