వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనమంతా జగన్‌వెంట నడుస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కుమ్మకై ్కనా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గాలి ముందు నిలవలేరని రాష్ట్ర విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన హిందూపురంలో పర్యటించారు. వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయకర్తలు బోయ శాంతమ్మ, టీఎన్ దీపికతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూగూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో భయపడి పోయిన చంద్రబాబు రాష్ట్రం శ్రీలంక మాదిరిగా ఆర్థిక దివాలా తీస్తుందని గగ్గోలు పెట్టాడన్నారు. కానీ ఇప్పుడు తాను జగన్‌మోహన్‌రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలనూ మోసం చేశాడన్నారు. మోసపూరిత హామీలివ్వడంలో చంద్రబాబును మించిన అవకాశవాది దేశంలోనే ఎవరూ లేరన్నారు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చాక ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలుపుకున్నాడన్నారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలకు పట్టం కడుతూ వారిని మహరాణులను చేశారన్నారు. అలాగే మహిళలకు పదవులిచ్చి పాలనలోనూ భాగస్వామ్యం చేశారన్నారు.
‘పురం’ అభివృద్ధి బాధ్యత నాది..
రానున్న ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలని, అప్పుడు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. హిందూపురం అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటున్నానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పురం అభివృద్ధికి ఇప్పటివరకు చేసిందేమీలేదన్నారు. నమ్మిన ప్రజలకు సేవలందించి పేరు నిలుపుకోవాలనే ఆలోచన కల్గిన నాయకులను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని, అంతేతప్ప హైదరాబాదులో ఉంటూ ఎప్పుడోకసారి అలా వచ్చి చేతులూపి వెళ్లేపోయే వారిని కాదని అన్నారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రెడ్డి ఈశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు మధుమతి రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబివుల్లా, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫిర్దోస్ ఖలీల్ పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post