రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం జిల్లా తెదేపా కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా వైకాపా చరిత్రలో హీనంగా నిలిచిపోతుందన్నారు. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబును, పవన్‌కళ్యాణ్‌ను విమర్శించారు. పత్రికా యాజమాన్యాలను ఆడిపోసుకున్నారు. అంతకు తప్పా ఏమైనా మాట్లాడారా అని ధ్వజమెత్తారు. జలకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఆశచూపి వైకాపా సభకు తీసుకొచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదన్నారు. తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
source : eenadu.net
Discussion about this post