‘తెదేపా అధినేత చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమను తిడుతుంటారు.. అదే కుప్పంలో మా పార్టీని గెలిపించకపోయినా ఇక్కడి ప్రజలు, నియోజకవర్గాన్ని నేను ఏనాడూ ఒక్క మాట అనలేదు. పైగా ఈ ప్రాంతవాసులను గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నా’ అని సీఎం జగన్ అన్నారు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్ఛాపురం.. ఇలా ఏ ప్రాంతంలోని పేదలనైనా పేదలుగానే చూసి కులం, మతం, ప్రాంతం.. చివరకు పార్టీ కూడా చూడకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానని చెప్పారు. సీఎం సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ (కేబీసీ) నుంచి కృష్ణా జలాలను చెరువులకు విడుదల చేశారు. అనంతరం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
source : eenadu.net










Discussion about this post