పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఎంపీ మాధవ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ఎంపీ మాధవ్‌ను పలకరించారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లోకి ప్రవేశించిన దుండగులను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ‘మాధవ్ జీ గ్రేట్’ అంటూ అభినందించారు.
source : sakshi.com
Discussion about this post