తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈ నెల ఆరో తేదీన నిర్వహించనున్న రా.. కదలిరా.. బహిరంగ సభా స్థలాన్ని తెదేపా నాయకులు గురువారం పరిశీలించి ఎంపిక చేశారు. జీడీనెల్లూరు సమీప రామానాయుడుపల్లె బస్టాపు వెనుక ఉన్న విశాలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. బహిరంగసభ ఏర్పాటుకు అవసరమైన వేదిక నిర్మించేందుకు భూమిపూజ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రా.. కదలిరా.. సభను విజయవంతం చేసేందుకు అందరు కృషిచేయాలని సూచించారు. సభ విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల్లో వైకాపా పాలనపై తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పారు. వైకాపాను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, పరసా రత్నం, నిమ్మల కిష్టప్ప, చిత్తూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు అరుణ, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు థామస్, మురళీమోహన్, కుప్పం ఇన్‌ఛార్జి మునిరత్నం, ఆరు మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post