ఆదివారం అనంతపురం నగరంలోని కేఎస్‌ఎన్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో రాష్ట్రస్థాయి పాఠశాలల ర్యాంకింగ్ చదరంగం పోటీలు జరిగాయి. అనంతపురం జిల్లా చెస్ అసోసియేషన్, ఏ1 చెస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 185 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ప్రతి విభాగంలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమానికి కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, హైకోర్టు న్యాయవాది దీపక్ దయానంద్, ఫోరెన్సిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం చెస్ అసోసియేషన్ చైర్మన్ బాలరాజు, అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post