టీడీపీతో అనైతిక పొత్తుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తుకావడం ఖాయమని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. పవన్‌ను ద్వారా ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి కావాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. కానీ రాజకీయ భిక్షపెట్టి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఒక లెక్క కాదన్నారు. శుక్రవారం ఆమె.. కౌన్సిలర్ సుధాకరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారని, కానీ ఇది ఆరంభం మాత్రమేనని అతను గుర్తించాలన్నారు. త్వరలోనే చంద్రబాబు అసలు స్వరూపం ఏమిటో పవన్‌కళ్యాణ్‌కు తెలుస్తుందన్నారు. ఇప్పటికై నా కొంత వాస్తవాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్ల జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచినట్లే పవన్ కళ్యాణ్‌ను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడవడం ఖాయమని మంత్రి తెలిపారు.
source : sakshi.com
Discussion about this post