అనంతపురం జిల్లాలో సిమెంట్ కంపెనీ పెడతామని వైఎస్ సన్నిహితుడు పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అమాయక నిరుపేద, బడుగు రైతులను మోసం చేసి ఎసైన్డ్ భూములు మాకు వద్దనిపించారు. వాటినే నామమాత్రపు ధరకు కొట్టేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల ఆమోదంతో సంబంధం లేకుండానే ప్రభుత్వ పెద్దల సాయంతో భూములను పట్టేశారు
కర్నూలు జిల్లాలో సున్నపురాయి గనుల లీజు కోసం ముందే దరఖాస్తు చేసుకున్న అల్ట్రా టెక్‌లాంటి కంపెనీలను పక్కకు నెట్టేసి… అడ్డగోలుగా పెన్నా అనుమతులు సంపాదించింది. పాత రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ సున్నపురాయి గనులను పాత కంపెనీని మార్చేసి.. కొట్టేసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గడువు ముగిసినా… అప్పటి సీఎం వైఎస్ విశేషాధికారాలతో పెన్నా అనుబంధ కంపెనీకి నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి అనేక వెసులుబాట్లు, రాయితీలిచ్చేశారు.
అనంతపురం జిల్లా యాడికి మండలంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు మార్కెట్ ధరతో ప్రభుత్వ భూమిని బదలాయించాలని కోరుతూ 2006 ఏప్రిల్ 22న పెన్నా సిమెంట్స్ జనరల్ మేనేజరు ఆ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము పట్టా భూములను కొన్నామని, వాటి పక్కన ఉన్న కుందనకోట, గుడిపాడు, కమలపాడులో భూమిని కేటాయించాలని కోరింది.
source : eenadu.net
Discussion about this post