ఈనెల 4వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోగల కియాఇండియా మోటార్స్ ఎదురుగా తెదేపా రా కదలిరా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పెనుకొండ అభ్యర్థి సవిత, ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యుడు రవీంద్ర తెలిపారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు పర్యటనకు సంబంధించి కియామోటార్స్ ఎదురుగా సవిత పెట్రోల్ బంకు వద్ద సభా స్థలం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 4వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించే రా కదలిరా బహిరంగ సభ ఉంటుందని, పార్టీశ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post