పెనుకొండ సమీపంలో ఈ నెల నాలుగవ తేదీన జరగనున్న రా.. కదిలిరా… సభకు టిడిపి కార్యకర్తలు భారీ స్థాయిలో తరలిరావాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురంలోని తన నివాసంలో నియోజకవర్గం తెదేపా నాయకులతో కలసి ఆమె మాట్లాడుతూ ఎన్నికలవేళ టిడిపి అధినేత చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారని ఆయన పర్యటనలకు జనం భారి స్థాయిలో తరలివస్తున్నారన్నారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిందని సునీత అన్నారు. పెనుకొండ కియా సమీపంలో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సభలో జిల్లాను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారని ఆయన ద్వారా ఎంత మేలు జరిగిందన్నది తెలియజేస్తారన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు తర్వాత చేయబోయే కార్యక్రమాలను కూడా వివరిస్తారన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరావాలని సునీత సూచించారు. మండలాల వారిగా నాయకులు దీనిపై సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సభకు తీసుకొని రావాలని సూచించారు. ఇప్పటినుంచే ఒకపక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగయ్య, కొండప్ప, సుధాకర్, నెట్టెం వెంకటేష్, రామమూర్తి, శ్రీనివాసులు, పరంధామ యాదవ్ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు …
Discussion about this post