రాప్తాడు వద్ద ఆటోనగర్‌లో జరిగిన సిద్ధం సభకు హాజరయ్యేందుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 2.50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్, కలెక్టర్ అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వభరత్, ఆర్టీఓ భాగ్యరేఖ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, పుట్టపర్తి తహసీల్దార్ వేణుగోపాల్… తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సభ ముగించుకుని సాయంత్రం 5.50 గంటలకు తిరిగి పుట్టపర్తి విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుని 6 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
source : sakshi.com










Discussion about this post