ఆశయాలు, సిద్ధాంతాలు అంటూ తిరిగే పవన్ కళ్యాణ్ అసలు ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎద్దేవా చేశారు. కాసేపు బీజేపీతో పొత్తు అంటారు.. అటు తర్వాత టీడీపీతో కలిసి తిరుగుతారని విమర్శించారు. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన చంద్రబాబుతోనే ఇప్పుడు పవన్ కలిసి వెళ్లడం వెనుక ఆశయం ఏమిటో అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.
చంద్రబాబు ఏనాడు రాష్ట్రంలో సంపద సృష్టించలేదని, సీఎం జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సుబ్బారావు చెప్పారని విషయాన్ని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ ఆశతో పార్టీ పెట్టారో …ఆశయం కోసం పెట్టారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆశయాలతో వచ్చిన పార్టీలనే ప్రజలు నమ్ముతారని తెలిపారు.
source : sakshi.com
Discussion about this post