జిల్లాలో మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3న నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు వంద శాతం పోలియో చుక్కలు వేయాలన్నారు. పలు కారణాలతో మిగిలిపోయిన చిన్నారులకు 4, 5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 925 పోలియో కేంద్రాలు, 38 సంచార పోలియో టీములు, 33 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేసారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వలంటీర్లు పాల్గొనాలని ఆదేశించారు. పల్స్ పోలియోపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
Discussion about this post