పత్రికా విలేకరులకు,పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీ. శ్రీధర్ గారు,బాలాజీ మనోహర్ గారు, కలసి హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ,,,ఎమ్ ఎల్ ఏ, ఆశావహుడైన అమానుల్లా తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని,స్వాతంత్ర సమర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సేవామందిరం పవిత్ర స్థలంలో కరపత్రాన్ని పీసీసీ ఉపాధ్యక్షులు కేటీ. శ్రీధర్ గారు ఆవిష్కరించారు. ముఖ్య అధితిగా పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ గారు హాజరై ఇరువురూ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మోడీ, జగన్ పరిపాలనలో ప్రజల జీవనం అస్త వ్యస్థమై, లక్షల కోట్లు గుజరాతీయులు బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఇతర దేశాలకు పారిపోయినా మోడీ పట్టించుకోలేదు. దేశ ఖాజానా ఖాళీ అయినందున దేశంలో ఆర్ధిక సంక్షో భంలో పడి పేద ప్రజలు కొనలేక తినలేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు.దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షినించి మైనారిటీల మీద, దళితులు, ఆదివాశీలమీద, ఓబీసీల మీద దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు జరిగినా అడిగే నాథు డే లేడు.మణిపూర్, అస్సామ్, యూ పి, లలో మారణ కాండ జరిగినా ప్రధాని గాని, జగన్ గాని నోరు మేదపలేదు.అందువల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ ని ఇండియా కూటమి ఆధ్వర్యంలో గెలిపించి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.రఘు వీరారెడ్డి గారి ఆదేశానుసారం మ్యానుఫెస్టోలోని అంశ్యాలను కరపత్రంలో పొందుపరచి ప్రజల్లోకి పోవాలని ఈరోజు నుండి కార్యక్రమం ప్రారంభించడమైనది. పట్టణంలోను,అన్ని మండల, పంచాయితీ లలో, సభలు పెట్టి కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్ ఎల్ ఏ ఆశావహు డైనా అమానుల్లా మాట్లాడుతూ అధిష్టానం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా,నా శ్యాయ శక్తుల మేరకు కస్టపడి పనిచేసి నాయకులను, కార్యకర్తలను అందరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కొరకు నియోజకవర్గం అంతా తిరిగి పార్టీకి పునర్ వైభవం తెస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, జమీల్, డీసీసీ ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా,జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ ఫయాజ్, ఆర్ టీ ఐ, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్లు సుహెబ్ ఖాన్, ఆశిఫ్,,పార్టీ మండల ప్రెసిడెంట్లు ఎస్. బాబు, గంగాధారప్ప, నరసింహాప్ప,కోటిపన్న,బిసి నాయకులు సంజీవప్ప,దాసన్న,ఈశ్వరప్ప ,నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు.
Discussion about this post