ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు పావగడ రహదారిలోని చెక్‌పోస్టు వద్ద శుక్రవారం శెట్టూరు ఎస్సై రాంభూపాల్, హెడ్ కానిస్టేబుల్ జాఫర్, పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి వయా పావగడ, కంబదూరు మీదుగా అనంతపురం దిశగా కారు వచ్చింది. దానిని తనిఖీ చేయగా రూ.10 లక్షల నగదు దొరికింది. ఆ నగదును బెంగళూరు వ్యాపారి గయాజుద్దీన్‌కి చెందిన శిరాజుద్దీన్, మహమ్మఇద్రీస్, రియాజ్ తరలిస్తున్నారు. ఆ నగదుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద లేవు. కూడేరులో దానిమ్మతోట కొన్నామని, దానికి చెల్లించడానికి నగదును తరలిస్తున్నామని వారు చెప్పారు. పట్టుకున్న నగదును జప్తు చేసి ఐటీ అధికారులకు బ్యాంకు ద్వారా అప్పజెప్పినట్లు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post