వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం(ఏప్రిల్ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు.
గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.
source : sakshi.com
Discussion about this post