హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. వీరు గురువారం సాయంత్రమే హిందూపురం చేరుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు పార్టీ పట్టణ అధ్యక్షుడు డీఈ రమేశ్‌కుమార్, పార్టీ నాయకులు నెట్టప్ప, బాచి, చంద్రమోహన్, అమర్‌నాథ్, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఇటీవల తెదేపా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కొల్లకుంట వడ్డె అంజినప్ప కుటుంబ సభ్యులతో వచ్చి ఎమ్మెల్యే బాలకృష్ణను ఆయన నివాస గృహంలో సత్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యేందుకు ఎంతో సహకరించారని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు. తాను ఎప్పటికి విధేయుడిగా ఉంటూ పార్టీ పటిష్ఠతకు, ఎన్నికల్లో జిల్లాలోని అసెంబ్లీ తెదేపా అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని అంజినప్ప పేర్కొన్నారు.
source :eenadu.net
Discussion about this post