సీఎం జగన్ ఈ నెల 28న (బుధవారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది.
source : sakshi.com
Discussion about this post