పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం(నేడు) విడుదల చేయనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెబ్‌సైట్‌లో 2023–24 టెన్త్ ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాసినట్టు తెలిపారు.
source : sakshi.com
Discussion about this post